BREAKING
ప్రజావాణికి 19 దరఖాస్తులు -12 మంది అధికారుల హాజరు వేపులపర్తి ప్రభుత్వం ప్రచారం జోరు.. రంగయ్య పై విమర్శలు చేసిన ఎమ్మెల్యే అమిలినేని. కౌంటింగ్ అధికారులకు స్వయంగా శిక్షణ ఇచ్చి, సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వాలీబాల్ క్రీడా సామాగ్రిని అందజేసిన ఎస్సై లోకేష్ కుమార్. అనుమతుల్లేని బోర్లపై రెవెన్యూ శాఖ కొరడా! ప్రఖ్యాత స్కామ్ ఫ్రాంచైజీ నుంచి మరో సంచలనం: సుబ్రత్ రాయ్ బయోపిక్‌గా ‘స్కైమ్ 2010’ టీజర్ విడుదల! ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు. వికారాబాద్ జిల్లాలో విషాదం.. మిస్సింగ్ కేసు నమోదు కాగా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దింది జ్యోతికే: భార్యపై ప్రశంసలు కురిపించిన హీరో సూర్య! కఠిన భద్రతా వలయంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్: బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి అభిమానులకు దర్శనం! రాప్తాడు దాడి కేసు నిందితుడికి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స. కింగ్ ‘తు మిల్ జాయే’ పాటలో సుహానా ఖాన్: సర్‌ప్రైజ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ! జడ్పీటీసీ తేజోవతి విజయానికి కూటమి నేతల విస్తృత ప్రచారం కూటమినేతల మాయ మాటలు నమ్మకండి.. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ‘మురసు’ తీవ్ర తుఫాన్ ఉధృతి: ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

Select Suryaa Now
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి  – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

మురసు తుపాను ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, అదనపు కలెక్టర్ చెన్నయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో వెబ్‌ఎక్స్ ద్వారా అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, బలహీనమైన ఇళ్లలో నివసించే ప్రజలను గుర్తించి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రతి మండలంలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు.
చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అచ్చంపేట–శ్రీశైలం జాతీయ రహదారి, నల్లమల ఘాట్ రోడ్డులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని చెంచు పెంటల్లో నివసించే ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు, భోజన వసతి కల్పించాలని తెలిపారు.
విద్యుత్ అంతరాయం, రహదారులపై చెట్లు కూలడం వంటి సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా సిబ్బంది, యంత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. రైతులు కోసిన వరి, పత్తి పంటలు తడవకుండా జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షాలు, ఈదురుగాలుల సమయంలో వ్యవసాయ పనులకు వెళ్లవద్దని రైతులకు తెలియజేయాలన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు పర్యాటక ప్రాంతాలు, జలపాతాల సందర్శనను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.
24 గంటల కంట్రోల్ రూమ్ నంబర్: 98667 56825
ప్రజలు అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 24 గంటల కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని, వాతావరణ శాఖ మరియు జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

సందడి రవీందర్ రెడ్డి,నాగర్ కర్నూల్, రూరల్, సూర్య న్యూస్: