BREAKING
వాలీబాల్ క్రీడా సామాగ్రిని అందజేసిన ఎస్సై లోకేష్ కుమార్. అనుమతుల్లేని బోర్లపై రెవెన్యూ శాఖ కొరడా! ప్రఖ్యాత స్కామ్ ఫ్రాంచైజీ నుంచి మరో సంచలనం: సుబ్రత్ రాయ్ బయోపిక్‌గా ‘స్కైమ్ 2010’ టీజర్ విడుదల! ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు. వికారాబాద్ జిల్లాలో విషాదం.. మిస్సింగ్ కేసు నమోదు కాగా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దింది జ్యోతికే: భార్యపై ప్రశంసలు కురిపించిన హీరో సూర్య! కఠిన భద్రతా వలయంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్: బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి అభిమానులకు దర్శనం! రాప్తాడు దాడి కేసు నిందితుడికి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స. కింగ్ ‘తు మిల్ జాయే’ పాటలో సుహానా ఖాన్: సర్‌ప్రైజ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ! జడ్పీటీసీ తేజోవతి విజయానికి కూటమి నేతల విస్తృత ప్రచారం కూటమినేతల మాయ మాటలు నమ్మకండి.. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ‘మురసు’ తీవ్ర తుఫాన్ ఉధృతి: ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అంగులూరులో టీడీపీలో చేరిన 60 వైసీపీ బీసీ కుటుంబాలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించండి. త్వరలో నటుడు రాహుల్ బోస్ ఆటోబయోగ్రఫీ: జీవితంలోని ఆసక్తికర విషయాలతో వచ్చే ఏడాది పుస్తక రూపంలోకి!

మార్తి రజిని గెలుపు కాయమంటున్నా స్థానికులు....

Select Suryaa Now
మార్తి రజిని గెలుపు కాయమంటున్నా స్థానికులు....

షేర్ మొహమ్మద్ పేట ఎంపీటీసీ సెగ్మెంట్ 1 నుండి తెలుగుదేశం పార్టీ తరుపున బరిలో మార్తి రజిని.


జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం షేర్ మొహమ్మద్ పేట గ్రామ ఎంపీటీసీ సెగ్మెంట్-1 నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మార్తి రజని ఎన్నికల బరిలో నిలిచారు. వ్యవసాయ కూలీ మేస్త్రిగా గ్రామ ప్రజలతో, రైతులతో నిత్యం మమేకమై పనిచేస్తున్న రజనికి గ్రామంలో మంచి గుర్తింపు ఉంది.
గ్రామీణ జీవితంతో అనుబంధం కలిగిన ఆమెకు రైతుల కష్టాలు, వ్యవసాయ కూలీల సమస్యలపై ప్రత్యక్ష అవగాహన ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన రజని గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉండటం, అందరితో సత్సంబంధాలు కొనసాగించడం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకునే వ్యక్తిగా మార్తి రజని ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొంటున్నట్లు సమాచారం.
మొత్తంగా సెగ్మెంట్-1 ఎన్నికల బరిలో మార్తి రజని అభ్యర్థిత్వంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రజల మద్దతు, ఆశీస్సులతో ఎన్నికల ప్రచారంలో ఆమె ముందుకు సాగుతున్నారు.

 

 

 

 

రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా