BREAKING
అనుమతుల్లేని బోర్లపై రెవెన్యూ శాఖ కొరడా! ప్రఖ్యాత స్కామ్ ఫ్రాంచైజీ నుంచి మరో సంచలనం: సుబ్రత్ రాయ్ బయోపిక్‌గా ‘స్కైమ్ 2010’ టీజర్ విడుదల! ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు. వికారాబాద్ జిల్లాలో విషాదం.. మిస్సింగ్ కేసు నమోదు కాగా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దింది జ్యోతికే: భార్యపై ప్రశంసలు కురిపించిన హీరో సూర్య! కఠిన భద్రతా వలయంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్: బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి అభిమానులకు దర్శనం! రాప్తాడు దాడి కేసు నిందితుడికి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స. కింగ్ ‘తు మిల్ జాయే’ పాటలో సుహానా ఖాన్: సర్‌ప్రైజ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ! జడ్పీటీసీ తేజోవతి విజయానికి కూటమి నేతల విస్తృత ప్రచారం కూటమినేతల మాయ మాటలు నమ్మకండి.. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ‘మురసు’ తీవ్ర తుఫాన్ ఉధృతి: ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అంగులూరులో టీడీపీలో చేరిన 60 వైసీపీ బీసీ కుటుంబాలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించండి. త్వరలో నటుడు రాహుల్ బోస్ ఆటోబయోగ్రఫీ: జీవితంలోని ఆసక్తికర విషయాలతో వచ్చే ఏడాది పుస్తక రూపంలోకి! మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై శిక్షణ

ఏపీలో 13 కేంద్రాల్లో రీపోలింగ్

Select Suryaa Now
ఏపీలో 13 కేంద్రాల్లో రీపోలింగ్

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల పరిధిలోని 13 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి రీపోలింగ్ ప్రారంభమైంది. నిన్న (ఆదివారం) జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ జరిగాయంటూ అందిన ఫిర్యాదులు, జిల్లా కలెక్టర్లు మరియు ఎన్నికల పరిశీలకుల నివేదికలను పరిశీలించిన పిమ్మట రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు. ప్రధానంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 (పులివెందుల మున్సిపాలిటీలోని 4 వార్డులతో కలిపి), పల్నాడు జిల్లా మాచర్లలో 2, తిరుపతి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో మళ్లీ ఓటింగ్ జరుగుతోంది.

ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రీపోలింగ్ జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నితమైన బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎస్‌ఈసీ నేరుగా పరిస్థితిని సమీక్షిస్తోంది.