వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య
నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండపేట మండలం ఏడిద గ్రామంలో ఆత్మహత్యకు సంబంధించిన ఘటనపై మండపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడిద గ్రామానికి చెందిన పోలేటి నాగ దుర్గారావు (43) ఈ నెల 1వ తేదీ రాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి బి ఎన్ ఎస్ సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ సి ఐ దొరరాజు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం
మృతుడు ఆత్మహత్యకు ముందు తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన వాయిస్ రికార్డింగ్‌లో పాస్టర్ పలివెల స్వతంత్ర కుమార్ తనపై చేసిన ఆరోపణల కారణంగా మానసిక వేదనకు గురైనట్లు పేర్కొన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. ఈ వాయిస్ రికార్డింగ్‌లోని అంశాల నేపథ్యంలో ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.ఈ ఘటనకు సంబంధించి క్లూస్ టీమ్ సహకారంతో సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కీలకమైన శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నారు. మృతుడి సెల్‌ఫోన్‌లోని వాయిస్ రికార్డింగ్‌తో పాటుఇతర డిజిటల్ ఆధారాలను సాంకేతికంగా విశ్లేషిస్తున్నారు. సంబంధిత వ్యక్తులను విచారిస్తూ ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసే దిశగా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సి ఐ దొరరాజు తెలిపారు.
ఈ కేసును మండపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దొర రాజు పర్యవేక్షణలో, మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కిషోర్ దర్యాప్తు చేస్తున్నారు.,