andhrapradesh
ఎస్‌ఈసీ తీరు దారుణం.. చంద్రబాబుకు తొత్తుగా మారింది: వైఎస్ జగన్ ధ్వజం
అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పూర్తి తొత్తుగా మారిపోయిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పక్షం చేస్తోన్న ఎన్నికల అక్రమాలకు ఎస్‌ఈసీ ప్రత్యక్షంగా అండగా నిలుస్తోందని, నిన్న జరిగిన ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యమని ఆయన ఆరోపించారు.
పులివెందులలో మొత్తం 80 పోలింగ్ బూత్‌లు ఉంటే, అందులో ఏకంగా 70 చోట్ల తమ పార్టీ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వకుండా అడ్డుకున్నారని వైఎస్ జగన్ తెలిపారు.
అధికార పార్టీ పక్షపాత వైఖరితో ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడిందని, అసలు ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ ఉందో ఎస్‌ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన అక్రమాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని, ప్రతి ఒక్క ఆధారాన్ని సేకరించి కోర్టుల దృష్టికి తీసుకెళ్లి గట్టిగా న్యాయపోరాటం చేస్తామని జగన్ స్పష్టం చేశారు.