BREAKING
పరిశ్రమలో నెగ్గాలంటే అంకితభావం చాలా ముఖ్యం: తానిచ్చిన ప్రివిలేజ్‌పై యువ నటుడు బాబిల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ. డా. జి. జానకి షర్మిల. సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు: చిత్ర పరిశ్రమకు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ తాజా మార్గదర్శకాలు! వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా విద్యుదాఘాతంతో ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు మృతి గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘రణబాలి’: నెట్‌ఫ్లిక్స్ పొరపాటుతో లీకైన స్ట్రీమింగ్ డేట్! లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్డీ బర్మన్ వంటి దిగ్గజాల మధ్య నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడ్డాను: అను మాలిక్ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే: మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన భావోద్వేగ వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద రామాయణం సునామీ: రూ. 75 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్, యష్, రణ్‌బీర్ సినిమాల రికార్డులు బ్రేక్! నిఘా నీడలో హరిదాస్ నగర్ గ్రామం.. సీసీ కెమెరాలు ప్రారంభించిన డి.ఎస్.పి నాగేంద్ర చారి కుందుర్పి ఎంపీడీఓ కార్యాలయం లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. ఏపీలో 13 కేంద్రాల్లో రీపోలింగ్ మొరుసు తుఫాను నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి .. జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ దర్శనం, భారీ పాదయాత్ర

Select Suryaa Now
హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ దర్శనం, భారీ పాదయాత్ర

హైదరాబాద్:కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావులతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఎయిర్‌పోర్ట్ నుండి అమిత్ షా నేరుగా చార్మినార్‌ వద్ద ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం బేగంపేట్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.

సాయంత్రం బషీర్‌బాగ్ (బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం) నుంచి ఎంజే మార్కెట్ వరకు తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘మహా పాదయాత్ర’లో అమిత్ షా పాల్గొననున్నారు. ఆ తర్వాత ఎంజే మార్కెట్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.