TUWJ వికారాబాద్ జిల్లా తృతీయ మహాసభకు ఎమ్మెల్యే బీఎంఆర్‌కు ఆహ్వానం
వికారాబాద్, మేజర్ న్యూస్: ఈ నెల 10వ తేదీన వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) వికారాబాద్ జిల్లా తృతీయ మహాసభకు హాజరుకావాలని కోరుతూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్)ను జర్నలిస్టులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మహాసభ నిర్వహణ, కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యేకు వివరించి, సభకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్ట్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసచారి, కొత్తపల్లి శ్రీధర్, సీనియర్ జర్నలిస్టు ఆర్ ఎం గిరీశ్వర స్వామి, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కుమ్మరి రాఘవేందర్, సీనియర్ జర్నలిస్టులు కొండాపూర్ వెంకటేష్, వెంకటరమణ, పకీరప్ప, చుక్కయ్య, మహేందర్, సత్యం, వెంకటేష్, ప్రవీణ్ చారి, తదితరులున్నారు.