షేర్ మొహమ్మద్ పేట సెగ్మెంట్ 2 లో వాసుదేవరెడ్డి దే విజయం అంటున్న గ్రామస్తులు
షేర్ మొహమ్మద్ పేట సెగ్మెంట్–2లో శ్యామల వాసుదేవరెడ్డి గెలుపుపై టీడీపీ శ్రేణుల్లో ధీమా!
ప్రజా సేవే పెట్టుబడిగా.. ప్రజాదరణే బలంగా.. విజయంపై కార్యకర్తల గట్టి నమ్మకం!
జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం షేర్ మొహమ్మద్ పేట ఎంపీటీసీ సెగ్మెంట్–2 నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్యామల వాసుదేవరెడ్డి పేరు ప్రస్తుతం గ్రామంలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో మంచి పేరు, పేద ప్రజలకు అండగా నిలిచే మనస్తత్వం, పలు సేవా కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం ఆయనకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
ఎన్నో సందర్భాల్లో ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచిన వాసుదేవరెడ్డికి గ్రామ ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రజలతో నిరంతరం మమేకమై ఉండటమే ఆయనకు ఉన్న ప్రధాన బలమని కార్యకర్తలు చెబుతున్నారు.
ఇక పార్టీ పెద్దల అండదండలు, స్థానిక నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి వాసుదేవరెడ్డికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. సెగ్మెంట్–2లో ఆయన గెలుపు ఖాయమనే నమ్మకంతో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.
మరోవైపు గ్రామంలో వాసుదేవరెడ్డి గెలుపుపై పందాలు సైతం జోరుగా సాగుతున్నాయనే చర్చ వినిపిస్తోంది. తమ అభ్యర్థి విజయంపై అంతటి నమ్మకం ఉందని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నారు.
ప్రజలతో ఉన్న అనుబంధం.. సేవా కార్యక్రమాలతో సంపాదించుకున్న గుర్తింపు.. పార్టీ శ్రేణుల మద్దతు.. ఇవన్నీ తమ అభ్యర్థికి కలిసొచ్చే అంశాలని వాసుదేవరెడ్డి వర్గీయులు బలంగా విశ్వసిస్తున్నారు. సెగ్మెంట్–2లో శ్యామల వాసుదేవరెడ్డి విజయంపై టీడీపీ కార్యకర్తలు పూర్తి ధీమాతో ఉన్నారు.
రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా