సొసైటీలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరపాలని ప్రజావాణిలో ఫిర్యాదు
సూర్య బెజ్జుర్ :కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని PACS సొసైటీలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరపాలని RTI కార్యకర్త ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సొసైటీలో 900 మంది పేర్లతో అక్రమ రుణాలు, ఇతరుల పట్టాలపై రుణాలు తీసుకున్నారని, 1983 నుంచి 2026 వరకు సొసైటీకి సంబంధించిన రికార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. RTI ద్వారా అడిగినా సమాచారం ఇవ్వడం లేదన్నారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని MPDO కు వినతిపత్రం అందజేశారు.