వైసిపి అభ్యర్థులను గెలిపించండి బియ్యపు పవిత్ర రెడ్డి
కూటమి మోసాలపై తిరగబడదాం.. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం!
వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించండి: బియ్యపు పవిత్రారెడ్డి పిలుపు
రేణిగుంటలో వైఎస్సార్‌సీపీ హోరెత్తిన ఇంటింటి ఎన్నికల ప్రచారం
చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచిందని వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి ధ్వజమెత్తారు. రేణిగుంట జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గంగారి సుజాతకు మద్దతుగా ఆదివారం పట్టణంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, మహిళలు, కార్యకర్తలతో కలిసి వీధివీధినా పర్యటించిన ఆమెకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.
ఈ సందర్భంగా బియ్యపు పవిత్రారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు నేరుగా ఇంటి గడపకే చేరాయని గుర్తుచేశారు. కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా ప్రతి పేదవాడి కళ్లల్లో జగనన్న వెలుగులు నింపారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తూ పేదల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. హామీలను నమ్మి ఓటేసిన ప్రజలను దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి అన్యాయాలను ఎదిరించాలన్నా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే గొంతును గెలిపించాలన్నా రేణిగుంటలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 5 వతేదీ జరగనున్న జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ ఏకమై ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, మన అభ్యర్థి గంగారి సుజాతను అఖండ మెజారిటీ తో గెలిపించాలని బియ్యపు పవిత్ర రెడ్డి పిలుపునిచ్చారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి*