BREAKING
‘మురసు’ తీవ్ర తుఫాన్ ఉధృతి: ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అంగులూరులో టీడీపీలో చేరిన 60 వైసీపీ బీసీ కుటుంబాలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించండి. త్వరలో నటుడు రాహుల్ బోస్ ఆటోబయోగ్రఫీ: జీవితంలోని ఆసక్తికర విషయాలతో వచ్చే ఏడాది పుస్తక రూపంలోకి! మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై శిక్షణ టి డి పి ఎన్నికల ప్రచారానికి విశేష స్పాందన. పారిశుధ్యంలో పటాన్‌చెరు సరికొత్త అడుగు పరిశ్రమలో నెగ్గాలంటే అంకితభావం చాలా ముఖ్యం: తానిచ్చిన ప్రివిలేజ్‌పై యువ నటుడు బాబిల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ. డా. జి. జానకి షర్మిల. సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు: చిత్ర పరిశ్రమకు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ తాజా మార్గదర్శకాలు! వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా విద్యుదాఘాతంతో ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు మృతి గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘రణబాలి’: నెట్‌ఫ్లిక్స్ పొరపాటుతో లీకైన స్ట్రీమింగ్ డేట్! లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్డీ బర్మన్ వంటి దిగ్గజాల మధ్య నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడ్డాను: అను మాలిక్

ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం. గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం. వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థి చాకలి లక్ష్మి.

Select Suryaa Now
ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం. గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం. వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థి చాకలి లక్ష్మి.

కుందుర్ప  ఆపిలేపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న చాకలి లక్ష్మి మర్రిస్వామి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్లను నేరుగా కలుస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, మహిళా కార్యకర్తలతో కలిసి ప్రజల్లోకి వెళ్తూ మద్దతు కూడగడుతున్నారు. మర్రిస్వామి మృదుస్వభావి, సౌమ్యుడిగా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా స్థానికంగా గుర్తింపు పొందారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పాటు వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి తనవంతు కృషి చేసే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఈ నేపథ్యంలో లక్ష్మి మర్రిస్వామి అభ్యర్థిత్వానికి మద్దతుగా కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనా విధానాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడమే తమ లక్ష్యమని ప్రచారంలో వివరిస్తున్నారు. ముఖ్యంగా ఆపిలేపల్లి గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడం, అంతర్గత రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి తాగునీరు అందుబాటులో ఉండేలా కృషి చేయడంతో పాటు వీధుల పరిశుభ్రత, మురుగు కాలువల నిర్వహణ, వీధి దీపాలు వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆశయాలు, మార్గదర్శకత్వంలో ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నట్లు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో మహిళలు, యువత, రైతులు, గ్రామ పెద్దలను కలుస్తూ గ్రామాభివృద్ధికి సంబంధించి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. వ్యక్తిగత పరిచయాలు, ప్రజలతో ఉన్న అనుబంధం, స్థానిక సమస్యలపై అవగాహనను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. మొత్తంగా ఆపిలేపల్లి ఎంపీటీసీ ఎన్నికల బరిలో చాకలి లక్ష్మి మర్రిస్వామి ప్రచారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలతో మమేకమయ్యే నాయకత్వం, గ్రామాభివృద్ధిపై స్పష్టమైన ప్రాధాన్యతలు, తలారి రంగయ్య ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామనే భరోసాతో ఆమె ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

కుందుర్పి రిపోర్టర్ :- టి. రాజు