52వ డివిజన్‌లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి
తిరుపతి నగరంలోని 52వ డివిజన్ పరిధిలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కల్పించిన కనీస వసతులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి ఓటర్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.