ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత: మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ :
మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్ ఖాజానగర్‌లోని చంద్రశేఖర్ ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక ధర్మమని పేర్కొన్నారు. నగర ప్రజలందరూ ఏ ఒక్కరూ మిగలకుండా తమ ఓటు హక్కును తప్పకుండా వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.