BREAKING
గౌరి లంకేష్ హత్య ప్రకాష్ రాజ్‌ను మానసికంగా కుంగదీసింది, ఆమె భార్య పోనీ వర్మ ఆవేదన ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ. తన ఓటు హక్కును వినియోగించుకున్న రెడ్డి అప్పలనాయుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి

బైక్ అదుపు తప్పి కాలువ లో పడి యువకుడు మృతి.

Select Suryaa Now
బైక్ అదుపు తప్పి కాలువ లో పడి యువకుడు మృతి.

కళ్యాణదుర్గం: పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు బైక్‌పై వస్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కళ్యాణదుర్గం మండల పరిధిలో చోటుచేసుకుంది. మండలంలోని గరుడాపురం కోళ్లఫారం సమీపంలో గురువారం రాత్రి బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు రాయదుర్గం మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన యువకుడిగా తెలుస్తోంది. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బైక్ అదుపుతప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాత్రి వేళ ప్రమాదం జరగడంతో యువకుడిని గుర్తించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. పెళ్లి వేడుకకు వస్తూ యువకుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం నెలకొంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.