కుందుర్పి వైయస్సార్గ్రెస్ పార్టీలోకి సీనియర్ నాయకులు.
కుందుర్పి: మండలంలోని బసాపురం పంచాయతీ పరిధిలోని మాయదార్లపల్లి గ్రామంలో నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుందుర్పి మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ గ్రామ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇదే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బోయ అంజనప్ప, బోయ నాగప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. టీడీపీ నుంచి వచ్చిన సీనియర్ నాయకులు వైసీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చేరికతో గ్రామంలో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కుందుర్పి మండల నాయకులు, కార్యకర్తలకు, మాయదార్లపల్లి గ్రామ ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.