BREAKING
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గొట్టిపాటి. గౌరి లంకేష్ హత్య ప్రకాష్ రాజ్‌ను మానసికంగా కుంగదీసింది, ఆమె భార్య పోనీ వర్మ ఆవేదన ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ. తన ఓటు హక్కును వినియోగించుకున్న రెడ్డి అప్పలనాయుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి దంపతులు

Select Suryaa Now
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి దంపతులు


--​క్యూలైన్లో నిలబడి ఓటేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి దంపతులు
--​ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడి
---​నంద్యాలలో ఉత్సాహంగా కొనసాగుతున్న పోలింగ్
​ నంద్యాల టౌన్ మేజర్ న్యూస్: నంద్యాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో భాగంగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన సతీమణితో కలిసి స్థానికంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి విచ్చేశారు.
​సాధారణ ఓటర్ల వలె క్యూలైన్లో నిలబడి వారు తమ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం అని, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన పౌరులంతా విధిగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని కోరారు.
​మరోవైపు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

జయభారత్ రెడ్డి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ