5 వేల మంది మాతృమూర్తులతో సామూహిక భగవద్గీత పారాయణం
సంగారెడ్డి: పటాన్‌చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ డివిజన్ పరిధిలో ఉన్న శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మంది మాతృమూర్తులు పాల్గొని సామూహికంగా భగవద్గీత పారాయణం చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరై భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు.భారీ సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయడంతో ఆశ్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. భక్తులు, నిర్వాహకులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.