అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై ఎస్పీ పర్యవేక్షణ
మచిలీపట్నం, మేజర్ న్యూస్: కృష్ణాజిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పోలీసు అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా సమస్యాత్మక పరిస్థితులు తలెత్తితే తక్షణమే స్పందించి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని స్థాయిల పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.