BREAKING
గౌరి లంకేష్ హత్య ప్రకాష్ రాజ్‌ను మానసికంగా కుంగదీసింది, ఆమె భార్య పోనీ వర్మ ఆవేదన ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ. తన ఓటు హక్కును వినియోగించుకున్న రెడ్డి అప్పలనాయుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి

వున్నం వారి కోడలు - పుట్టిన ఊరిలో బ్రహ్మరథం* బ్రాహ్మణపల్లిలో గడపగడప ప్రచారంలో దూసుకెళ్తున్న జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ వున్నం దీపిక పిడుగురాళ్ల: పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక తన పుట్టిన ఊరు బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన గడపగడప ప్రచారానికి విశేష స్పందన లభిం

Select Suryaa Now
వున్నం వారి కోడలు - పుట్టిన ఊరిలో బ్రహ్మరథం*  బ్రాహ్మణపల్లిలో గడపగడప ప్రచారంలో దూసుకెళ్తున్న జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ వున్నం దీపిక  పిడుగురాళ్ల: పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక తన పుట్టిన ఊరు బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన గడపగడప ప్రచారానికి విశేష స్పందన లభిం

వున్నం వారి కోడలు - పుట్టిన ఊరిలో బ్రహ్మరథం*

బ్రాహ్మణపల్లిలో గడపగడప ప్రచారంలో దూసుకెళ్తున్న జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ వున్నం దీపిక

పిడుగురాళ్ల: పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక తన పుట్టిన ఊరు బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన గడపగడప ప్రచారానికి విశేష స్పందన లభించింది.

ఉదయం నుంచే గ్రామంలో ప్రచారం హోరెత్తింది. డప్పుల చప్పుళ్లు, డిజె సౌండ్ల నడుమ మహిళలు హారతులిస్తూ, పూలమాలలతో స్వాగతం పలకగా ప్రచార రథంపై గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి వాడలో పర్యటించారు.

చిన్నప్పుడు తాను తిరిగిన గడపలన్నీ తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్లి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ "నేను మీ ఇంటి బిడ్డను" అంటూ ఓటర్ల మన్ననలు పొందుతూ ప్రచారం కొనసాగించారు.

ఈ సందర్భంగా డా. దీపిక మాట్లాడుతూ "నేను మీ ఇంటి బిడ్డను. ఇది నేను పుట్టిన ఊరు. ఈ ఊరి రుణం తీర్చుకునే అవకాశం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. వైద్యురాలిగా నా పనితీరు భేష్ అని మీరే చెప్పారు. వైద్యరంగంలో ఎన్నో సేవలు చేశాను. ఇప్పుడు రాజకీయ రంగంలో తొలి అడుగు వేస్తున్నాను. రాజకీయ నాయకురాలిగా కూడా నా పనితీరు చూసి నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి" అని అన్నారు.

"గ్రామంలోని వీధులు, వాడలు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇలాంటి సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాడి పరిష్కరిస్తాను. మంచి నాయకత్వాన్ని నిలబెట్టుకుంటానని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. నా విజయానికి తోడుగా ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఉండాలి. సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి" అని విజ్ఞప్తి చేశారు.

వున్నం కుటుంబం గతంలో చేసిన సేవలను, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని డా. దీపికకు మద్దతు తెలిపారు.

వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల