BREAKING
కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు విషాదాలను మళ్లీ గుర్తు చేసుకోవడం చాలా కష్టం.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులలో నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ కార్యక్రమం పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి శెట్టిపాలెంలో శ్రీశ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక్ శోభతో కల కల లాడిన శైవ క్షేత్రం ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి గ్రామాల్లో పంచాయతీల పదవుల వేడి అభివృద్ధికి పట్టం కట్టండి.. పట్టణ ప్రగతికి భాగస్వామ్యంగా నిలవండి... ఎమ్మెల్యే " కోండ్రు " బోల్తా పడిన లారీ ఆడపిల్లను కాపాడుకుందాం.. లింగ నిర్ధారణకు స్వస్తి పలుకుదాం! ధర్మపురిలో సందడే సందడి.. భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఐటీఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.... శివాలయాల్లో మార్మోగిన హరనామస్మరణం

మైనంపల్లి హన్మంతరావు సహాకారంతోనే రోడ్ల మరమ్మతులు : పోతుల వినోద్ యాదవ్

Select Suryaa Now
మైనంపల్లి హన్మంతరావు సహాకారంతోనే  రోడ్ల మరమ్మతులు : పోతుల వినోద్ యాదవ్
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్ నగర్‌లో రూ.19 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు ప్యాచ్‌ వర్క్ పనులను సోమవారం కాంగ్రెస్ పార్టీ మౌలాలి డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్  ప్రారంభించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ, భరత్ నగర్, ఆర్టీసీ కాలనీ, మారుతీనగర్, ఉల్ఫత్ నగర్ తదితర ప్రాంతా ల్లో రోడ్లు బాగా దెబ్బతినడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన తాను, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు దృష్టికి తీసుకెళ్లడంతో దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు ఎంఎం సీ ఆధ్వర్యంలో  మొత్తం రూ.19 లక్షల నిధు లతో ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్యాచ్‌ వర్క్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తొలుత భరత్ నగర్‌లో ఈ పను లను ప్రారంభించినట్లు వినోద్ యాదవ్
చెప్పారు. అనంతరం ఆర్టీసీ కాలనీ, మారుతీ నగర్, ఉల్ఫత్ నగర్ లలో కూడా రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజలకు మెరుగైన మౌలిక సదు పాయాలు కల్పించేందుకు మైనంపల్లి హన్మంతరావు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా మౌలాలి డివిజన్ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ,మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా
ఉపాధ్యక్షుడు ఫారూఖ్, జిల్లా కార్యదర్శి మంద భాస్కర్, సీనియర్ నాయకులు హమీద్, దైవ సహాయం, రమేష్, మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ షకీల్, పాండురంగా చారి, చరణ్, మహిళా నాయకురాళ్లు సునీత, పద్మ, కాసింబీ తదితరులు పాల్గొన్నారు.