BREAKING
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా *నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ లో ఘనంగా బాలోత్సవ వేడుకలు..* APRS సంతనూతలపాడు పాఠశాలకు ప్రశంశాపత్రం విట్లంపల్లి తాగునీటికి శాశ్వత పరిష్కారం.. లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు! స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్ సిరివెళ్ల నీటి కుంటలో తగ్గుతున్ననీటిమట్టం_ ---ఆందోళనలో గ్రామస్తులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి:ప్రకాశం జిల్లా పోలీసులు మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ పెట్టుబడుల వరద రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు వైసీపీకి మరో భారీ షాక్.. టీడీపీలోకి పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్ వారణాసి తర్వాత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపైనే ఫోకస్? సీఐఐ సదస్సు ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ను వీక్షించిన మంత్రి లోకేష్

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

Select Suryaa Now
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి: అదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్‌లో ఎస్.టి. జోసెఫ్స్ కాన్వెంట్ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రహరి క్లబ్  డ్రగ్ అబ్యూస్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ సమయంలో మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని విద్య, క్రీడలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్‌కు అలవాటు పడకుండా ఉండటమే కాకుండా, ఎవరైనా మాదకద్రవ్యాల ప్రభావానికి గురవుతున్నట్లు గుర్తిస్తే వారికి సరైన అవగాహన కల్పించి సహాయం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులతో పాటు ప్రజల్లో కూడా విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఎస్.టి. జోసెఫ్స్ కాన్వెంట్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు నో చెప్పండి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి.. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి అని విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.మంచి సమాజ నిర్మాణం నేటి విద్యార్థుల నుంచే ప్రారంభమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ రహిత అదిలాబాద్ నిర్మాణానికి సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌తో పాటు మున్సిపల్ కౌన్సిలర్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.