లైన్స్ క్లబ్ ఆఫ్ వట్టిపల్లి వారి ఆధ్వర్యంలో, వ్యాసరచన పోటీలు.
వట్టిపల్లి ; మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 18 -11 -2026 నాడు లైన్స్ క్లబ్ ఆఫ్ వట్పల్లి వారి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించినారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహించినట్లు పిజిహెచ్ఎం రంజిత్ సింగ్ తెలిపినారు. ఈ పోటీలలో మొదటి బహుమతి భార్గవి, రెండో బహుమతి మస్కాన్ అనే విద్యార్థులు సాధించినారు. విద్యార్థులకు మేమోంటోలు అందజేసినారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సిద్ధేశ్వర్ ,కార్యదర్శి కచూర్ రావు, సభ్యులు గోపాల్ రెడ్డి ,డిసి పెద్దన్న ,వైద్యసాగర్ ,దిగంబర రావు, సుభాష్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.