కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని దొడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.కుటుంబ కలహాల నేపథ్యంలో పిట్టల అరుణ (26)శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు,కుటుంబ సభ్యులు తెలిపారు.అరుణకు పిట్టల రామలింగంతో వివాహం కాగా,వీరికి ఇద్దరు సంతానం.కుమార్తె వేదశ్రీ (2),కుమారుడు రుద్రతేజ (5)ఉన్నారు.భర్త రామలింగం గత 13సంవత్సరాలుగా సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు.కుటుంబ కలహాల నేపథ్యంలో అరుణ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు తల్లిలేని వారిగా మిగలడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.