BREAKING
ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ అభద్రతాభావానికి గురిచేస్తుంది: ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్ మెలియాపుట్టి జడ్పీటీసీగా బమ్మిడి చామంతి ఘన విజయం దీపావళి ఆనందంగా జరుపుకోవాలి... జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి భట్టిప్రోలు మండలం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి కాలిఫోర్నియా పోర్టుల కాంట్రాక్టు చర్చలు పొడిగింపు పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై విచారణ దక్షిణ అమెరికా పర్యటనలో పాప్ లియో ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సముద్ర దిగ్బంధానికి తోడుగా సరిహద్దు వాణిజ్యంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు విశాఖ యువకులను క్షేమంగా స్వదేశానికి చేరుస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు

Select Suryaa Now
జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు

నెల్లూరు కల్చరల్, మేజర్ న్యూస్  :   ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో శనివారం భక్తుల కానుకల హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు, దేవస్థాన చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి  సమక్షంలో ఆలయ ప్రాంగణంలో హుండీలను తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. గత 95 రోజులకు గాను (తేదీ 04.08.2026 నుండి 06.11.2026 వరకు) శ్రీవార్ల ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ. 53,68,476 నగదు ఆదాయం లభించింది. అలాగే అన్నప్రసాద హుండీ ద్వారా రూ. 3,00,487 ఆదాయం సమకూరింది. దీంతో ఆలయానికి మొత్తం రూ.56,68,963 నగదు రూపంలో సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు భక్తులు స్వామి, అమ్మవార్లకు పెద్ద ఎత్తున విలువైన కానుకలను సమర్పించారు. ఇందులో 71 గ్రాముల 800 మిల్లీ గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. వీటితో పాటు విదేశీ కరెన్సీ సైతం భారీగా వచ్చింది; 11 యూఎస్ డాలర్లు, 160 థాయ్ బాట్, 100 సింగపూర్ డాలర్లు, 10 మలేసియా రింగిట్‌లను భక్తులు హుండీల్లో సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మూలాపేట శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి జంజనం శ్రీనివాసరావు, జన్నవాడ దేవస్థాన సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, చైర్మన్  అశోక్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు  ముంగర సుధాకర్ పాల్గొన్నారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం పోలీసు సిబ్బంది, స్థానిక ఏపీజీ బ్యాంక్ ప్రతినిధులు, ఆలయ సిబ్బంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగులు, శ్రీవార్ల సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.