BREAKING
దేశీయ సానుకూల సంకేతాలు: 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల జోరు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లకు ఊరట! *జానపాడు శివాలయం వద్ద అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ మహోత్సవం* *పిడుగురాళ్ల మండలం జానపాడు, నవంబర్ 13 (సూర్య న్యూస్):* పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి అభిషేకములు, దివ్య పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వున్నం నాగమల్ల లక్ష్మీనరసింహస్వామి జాతరలో పాల్గొన్న ఎంఎల్ఏ సురేంద్రబాబు గ్లోబల్ టెక్ & కార్పొరేట్ పరిణామాలు: అమెరికా-యూరప్ టెక్ దిగ్గజాల సంచలనాల ప్రభావం దేశీయ మార్కెట్లపై ఎలా ఉంటుంది? కేంబ్రిడ్జ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం - ఉపాధ్యాయుల వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ 2వ వార్డులో బొమ్మన రామ్ కాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం 13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతి విస్తృత ప్రచారం బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం భక్తి శ్రద్దల మధ్య నరసింహస్వామి జాతర.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే. పల్లె పోరుకు తెరలేచింది.. మూడు రోజులు నామినేషన్ల పర్వం ఆరు దశాబ్దాల అనంతరం అంజన్న నిజ స్వరూపం.. కోయ నర్సాపురంలో ఘనంగా బాలల గ్రామసభ.. పల్లెల్లో పగడ్బందీగా పోలీసుల నిఘా, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు. డీఎస్పీ దైవప్రసాద్. ఒకే రౌటర్ లోపంతో అమెరికా విమానయానం అతలాకుతలం... 14 పంచాయతీల్లో సర్పంచ్ పీఠంపై ఆశావహుల కన్ను.. ఒకరిని మించి మరొకరు.. పార్టీలకు అభ్యర్థుల ఎంపికే పెద్ద సవాల్!

కేంబ్రిడ్జ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం - ఉపాధ్యాయుల వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు

Select Suryaa Now
కేంబ్రిడ్జ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం - ఉపాధ్యాయుల వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు

సూర్య - మానకొండూరు : మానకొండూరు మండల కేంద్రంలోని కేంబ్రిడ్జ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో శనివారం భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం చిన్నారుల కోలాహలంతో సందడిగా మారింది. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ దుంపేటి అంజలి, శ్రీనివాస్‌లు ఉపాధ్యాయులతో కలిసి జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో తరగతి గదుల్లోకి వెళ్లి తోటి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో చిన్నారులు తాము ఉపాధ్యాయులుగా మారినప్పటి మధుర అనుభవాలను తోటివారితో పంచుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ దుంపేటి అంజలి, శ్రీనివాస్ మాట్లాడుతూ... దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన మహానేత నెహ్రూ అని కొనియాడారు. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. చిన్నపిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయనను అందరూ ఆప్యాయంగా 'చాచా నెహ్రూ' అని పిలుచుకుంటారని విద్యార్థులకు వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గీత, సువర్ణ, నర్మద, మంజుల, మౌనిక, సుధ, శ్రీమహి, కె.శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.