*జానపాడు శివాలయం వద్ద అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ మహోత్సవం* *పిడుగురాళ్ల మండలం జానపాడు, నవంబర్ 13 (సూర్య న్యూస్):* పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి అభిషేకములు, దివ్య పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వున్నం నాగమల్ల
*జానపాడు శివాలయం వద్ద అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ మహోత్సవం
పిడుగురాళ్ల మండలం జానపాడు, నవంబర్ 13 (సూర్య న్యూస్):
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి అభిషేకములు, దివ్య పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వున్నం నాగమల్లేశ్వరరావ
సమయం: సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంక్ సందు, శివాలయం గుడివద్ద, జానపాడు గ్రామం, పిడుగురాళ్ల మండలం.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకములు, పడిపూజ, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ పడిపూజ మహోత్సవానికి పరిసర ప్రాంతాల్లోని అయ్యప్ప స్వాములు, భవానీలు, శివ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
ఆహ్వానించువారు: వున్నం నాగమల్లేశ్వరరావు గారి కుమారుడు వున్నం చంద్ర సతీష్, జానపాడు
వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల