BREAKING
పల్లెల్లో పగడ్బందీగా పోలీసుల నిఘా, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు. డీఎస్పీ దైవప్రసాద్. ఒకే రౌటర్ లోపంతో అమెరికా విమానయానం అతలాకుతలం... 14 పంచాయతీల్లో సర్పంచ్ పీఠంపై ఆశావహుల కన్ను.. ఒకరిని మించి మరొకరు.. పార్టీలకు అభ్యర్థుల ఎంపికే పెద్ద సవాల్! హార్ముజ్ జలసంధి దాడులతో చమురు ధరల సెగ రేపటి స్టాక్ మార్కెట్ అంచనాలు: గల్ఫ్ ఉద్రిక్తతలు, చమురు ధరల ప్రభావంతో అప్రమత్తంగా మదుపర్లు! అతి వేగంతో అదుపుతప్పి బోల్తాపడిన ఇన్నోవా.. ఆరుగురికి తీవ్ర గాయాలు హౌతీ డ్రోన్లను కూల్చివేసిన సౌదీ సంకీర్ణ దళాలు మధురై తనిష్క్ దోపిడీ కేసులో యూట్యూబర్ మీనాక్షి, ప్రధాన నిందితుడి తండ్రి అరెస్ట్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన బెంగాల్ సీఎం సువేందు అధికారి ఢిల్లీ ఈడీ కార్యాలయం నుంచి బయలుదేరిన వైద్యుల బృందం ఛత్తీస్‌గఢ్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ స్మృతి ఇరానీ... చైనా పూర్తి ఎలక్ట్రిక్ విమానం CE-25A తొలి పైలట్ ఫ్లైట్ సక్సెస్... కొత్త స్టార్‌షిప్ రాకెట్ పూర్తి రికవరీకి స్పేస్‌ఎక్స్ సన్నాహాలు వీణవంకలో పోలీసుల నాకాబందీ తనిఖీలు చిప్ ఎగుమతి ఆంక్షల సడలింపునకు ముందు 5 మిలియన్ డాలర్ల వరకు ఎన్విడియా షేర్లు కొన్న డొనాల్డ్ ట్రంప్

14 పంచాయతీల్లో సర్పంచ్ పీఠంపై ఆశావహుల కన్ను.. ఒకరిని మించి మరొకరు.. పార్టీలకు అభ్యర్థుల ఎంపికే పెద్ద సవాల్!

Select Suryaa Now
14 పంచాయతీల్లో సర్పంచ్ పీఠంపై ఆశావహుల కన్ను.. ఒకరిని మించి మరొకరు.. పార్టీలకు అభ్యర్థుల ఎంపికే పెద్ద సవాల్!

పరిగి మేజర్ న్యూస్:

పరిగి మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సర్పంచ్ పదవిని ఆశిస్తున్న నాయకులు ఒక్కొక్కరుగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు తమకు అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీల ముఖ్య నాయకుల వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నారు. గతంలో గ్రామ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారితో పాటు ఈసారి కొత్తగా బరిలోకి దిగాలని భావిస్తున్న ఆశావహులు కూడా తమకు ప్రజాబలం ఉందంటూ ముందుకొస్తున్నారు.

మాకేం తక్కువ.. మాకూ అవకాశం ఇవ్వండి! అంటూ ఆశావహులు తమ వాదనలు వినిపిస్తుండటంతో పార్టీల ముఖ్య నాయకులకు అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారుతోంది. ఒకే గ్రామంలో ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు సర్పంచ్ పదవిని ఆశిస్తుండటంతో ఎవరికి అవకాశం కల్పించాలి? ఎవరిని బరిలోకి దింపాలి? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

మరోవైపు గ్రామాల్లో తమకున్న పరిచయాలు, అనుచరగణం, సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్థోమత, గతంలో చేసిన సేవలను ప్రస్తావిస్తూ ఆశావహులు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం కొందరు ప్రయత్నిస్తుంటే, మరికొందరు గ్రామస్థాయిలో మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.అధికార కూటమి పార్టీలతో పాటు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీల్లోనూ ఆశావహుల కదలికలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీ మద్దతు ఒకరికి ప్రకటిస్తే మిగిలిన ఆశావహులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మొత్తానికి 14 పంచాయతీల్లో సర్పంచ్ పదవుల కోసం ఆశావహుల మధ్య పోటీ పెరుగుతుండటంతో గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్, రిజర్వేషన్లు, అభ్యర్థుల ఖరారు తర్వాత ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముంది. చివరకు ఎవరికి పార్టీ అవకాశం కల్పిస్తుంది? ఎవరు స్వతంత్రంగా బరిలోకి దిగుతారు? అన్నది పరిగి మండల రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది!