BREAKING
ఢిల్లీ ఈడీ కార్యాలయం నుంచి బయలుదేరిన వైద్యుల బృందం ఛత్తీస్‌గఢ్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ స్మృతి ఇరానీ... చైనా పూర్తి ఎలక్ట్రిక్ విమానం CE-25A తొలి పైలట్ ఫ్లైట్ సక్సెస్... కొత్త స్టార్‌షిప్ రాకెట్ పూర్తి రికవరీకి స్పేస్‌ఎక్స్ సన్నాహాలు వీణవంకలో పోలీసుల నాకాబందీ తనిఖీలు చిప్ ఎగుమతి ఆంక్షల సడలింపునకు ముందు 5 మిలియన్ డాలర్ల వరకు ఎన్విడియా షేర్లు కొన్న డొనాల్డ్ ట్రంప్ జెన్సన్ హువాంగ్ రాజీనామా వేళ విచిత్ర పరిస్థితి: బెంగళూరు మెట్రో పింక్ లైన్ సేవలు షురూ: టెస్లాతో స్పేస్‌ఎక్స్ విలీనానికి ఎలాన్ మస్క్ ప్రతిపాదన: S&P 500 సూచీలోకి ఎంట్రీకి కొత్త మార్గం! వినియోగదారుల ఫొటోల యాక్సెస్‌పై మెటాకు 805 మిలియన్ల భారీ జరిమానా విధించిన ఇటలీ నియంత్రణ సంస్థ టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ

వీణవంకలో పోలీసుల నాకాబందీ తనిఖీలు

Select Suryaa Now
వీణవంకలో పోలీసుల నాకాబందీ తనిఖీలు

సూర్య వీణవంక: కరీంనగర్ సీపీ ఆదేశాల మేరకు వీణవంక మండల కేంద్రంలో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో నాకాబందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ పులి వెంకట్ పాల్గొని పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా సీఐ పులి వెంకట్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల కదలికలను గుర్తించేందుకు నాకాబందీ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల భద్రతకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.నాకాబందీ సందర్భంగా వాహనాలను తనిఖీ చేసి, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.