BREAKING
పల్లెల్లో పగడ్బందీగా పోలీసుల నిఘా, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు. డీఎస్పీ దైవప్రసాద్. ఒకే రౌటర్ లోపంతో అమెరికా విమానయానం అతలాకుతలం... 14 పంచాయతీల్లో సర్పంచ్ పీఠంపై ఆశావహుల కన్ను.. ఒకరిని మించి మరొకరు.. పార్టీలకు అభ్యర్థుల ఎంపికే పెద్ద సవాల్! హార్ముజ్ జలసంధి దాడులతో చమురు ధరల సెగ రేపటి స్టాక్ మార్కెట్ అంచనాలు: గల్ఫ్ ఉద్రిక్తతలు, చమురు ధరల ప్రభావంతో అప్రమత్తంగా మదుపర్లు! అతి వేగంతో అదుపుతప్పి బోల్తాపడిన ఇన్నోవా.. ఆరుగురికి తీవ్ర గాయాలు హౌతీ డ్రోన్లను కూల్చివేసిన సౌదీ సంకీర్ణ దళాలు మధురై తనిష్క్ దోపిడీ కేసులో యూట్యూబర్ మీనాక్షి, ప్రధాన నిందితుడి తండ్రి అరెస్ట్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన బెంగాల్ సీఎం సువేందు అధికారి ఢిల్లీ ఈడీ కార్యాలయం నుంచి బయలుదేరిన వైద్యుల బృందం ఛత్తీస్‌గఢ్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ స్మృతి ఇరానీ... చైనా పూర్తి ఎలక్ట్రిక్ విమానం CE-25A తొలి పైలట్ ఫ్లైట్ సక్సెస్... కొత్త స్టార్‌షిప్ రాకెట్ పూర్తి రికవరీకి స్పేస్‌ఎక్స్ సన్నాహాలు వీణవంకలో పోలీసుల నాకాబందీ తనిఖీలు చిప్ ఎగుమతి ఆంక్షల సడలింపునకు ముందు 5 మిలియన్ డాలర్ల వరకు ఎన్విడియా షేర్లు కొన్న డొనాల్డ్ ట్రంప్

పల్లెల్లో పగడ్బందీగా పోలీసుల నిఘా, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు. డీఎస్పీ దైవప్రసాద్.

Select Suryaa Now
పల్లెల్లో పగడ్బందీగా పోలీసుల నిఘా, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు  గుర్తింపు. డీఎస్పీ దైవప్రసాద్.

కళ్యాణదుర్గం: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కళ్యాణదుర్గం పోలీసు సబ్‌డివిజన్ పరిధిలోని అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను ఇప్పటికే గుర్తించి ఆయా ప్రాంతాల్లో పకడ్బందీ నిఘా ఏర్పాటు చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ దైవప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ కట్టుదిట్టమైన పోలీసు భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. గతంలో చోటుచేసుకున్న ఘటనలు, ప్రస్తుత పరిస్థితులు, గ్రామాల్లోని రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో పోలీసు సిబ్బందితో నిరంతరం పర్యవేక్షణ చేపడతామని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో హులికల్లు, బోరంపల్లి, గోళ్ల, మానిరేవు, ముప్పులకుంట, రాయలప్పదొడ్డి, నాగిరెడ్డిపల్లి, ఎరడికెర, పడమటి కోడిపల్లి, భైరవానితిప్ప, భైరసముద్రం, కర్తనపర్తి, కురాకులపల్లి, రాళ్ల అనంతపురం, రాంపురం, తిప్పనపల్లి, గొల్లపల్లి, అచ్చంపల్లి, బెస్తరపల్లి, మహంతపురం, ఎనుములదొడ్డి, మలయనూరు, జంబుగుంపల, ఐదుకల్లు, చింతర్లపల్లి, శెట్టూరు గ్రామాలను అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. రాయదుర్గం నియోజకవర్గంలో మెచ్చిరి, చదం గొల్లలదొడ్డి, బొమ్మనహాళ్, దర్గాహోన్నూరు, గోవిందవాడ, కొలగాహనళ్లి, కళ్లెం, మలపనగుడి, మురడి, బేలోడు, గొల్లపల్లి, భూపసముద్రం, హనకానహాళ్, జక్కలవడికి, కలేకుర్తి, కణేకల్లు, ఎర్రగుంట గ్రామాలను అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో చాపిరి, కొండాపురం, ముద్దినాయనపల్లి, పి.టి.ఆర్.పల్లి తండా, తూర్పుకోడిపల్లి, భట్టువానిపల్లి, పాలవాయి, గరుడాపురం, కొత్తూరు, నారాయణపురం, బోయలపల్లి, దురదకుంట, తిమ్మసముద్రం, బొమ్మగానిపల్లి, తీటకల్లు, పిల్లలపల్లి, కన్నేపల్లి, బ్రహ్మసముద్రం, పాలవెంకటాపురం, సంతేకొండాపురం, గుండిగానిపల్లి, వేపులపర్తి, ఒంటారెడ్డిపల్లి, ఆండేపల్లి, కుర్లపల్లి, చెన్నంపల్లి, ఐపార్శపల్లి, చెర్లోపల్లి, డి.చెన్నంపల్లి, గూళ్యం, అయ్యంపల్లి, గుద్దేళ్ల, మర్రిమాకులపల్లి, ములకనూరు, కదిరిదేవరపల్లి, నూతిమడుగు, తిప్పేపల్లి, వెంకటంపల్లి, ఎర్రమల్లేపల్లి, రాళ్లపల్లి, జక్కిరెడ్డిపల్లి, ఓబుగానిపల్లి, తూముకుంట, తెనగల్లు, కరిగానిపల్లి, ఎర్రగుంట, అపిలేపల్లి, బసాపురం, నిజవళ్లి, జంబుగుంపల, కుందుర్పి, చిన్నంపల్లి, యాటకల్లు, బచ్చేహళ్లి, మాకోడికి, కైరేవు, లక్కంపల్లి, కనుకూరు, తిప్పనపల్లి, అనుంపల్లి, ములకలేడు, పెరుగుపాళ్యం, అయ్యగార్లపల్లి తదితర గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఉడేగోళం, బి.ఎన్.హళ్లి, చదం, ఆర్.బి.వంక, టి.వీరాపురం, డి.కొండాపురం, ఆవులదట్ల, వేపరాళ్ల, నాగిరెడ్డిపల్లి, కెంచానపల్లి, బండూరు, ఏళ్లంజి, కల్లుహోళ, లింగదహాల్, సింగనహళ్లి, శ్రీధరగట్ట, ఉద్దేహాళ్, ఉంతకల్లు, డీ.హీరేహాళ్, జాజరకల్లు, హెచ్.హనుమాపురం, మల్లికేతి, ఓబుళాపురం, పూలకుర్తి, సిరిగేదొడ్డి, కె.పి.దొడ్డి, నేత్రపల్లి, తాళ్లకెర, రంగసముద్రం, పూలకుంట, వీరాపురం, కలుగోడు, గోనబావి, బెణకల్లు, బీదరకుంతం, బ్రహ్మసముద్రం, గోపులాపురం, హులికేర, రచ్చుమర్రి, సొల్లాపురం, తుంటిగనూరు తదితర గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, గొడవలు, ఘర్షణలు, బెదిరింపులకు పాల్పడవద్దని కోరారు. గ్రామాల్లో పోలీసులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీఎస్పీ దైవప్రసాద్ విజ్ఞప్తి చేశారు.