devotional
ఆరు దశాబ్దాల అనంతరం అంజన్న నిజ స్వరూపం..
సూర్య కరీంనగర్ ప్రతినిధి ::తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా పేరుపొందిన ప్రముఖ దేవాలయం తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు లో ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుండి 20 వరకు అంజన్న స్వామికి చందనోత్సవం తొలగింపుకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు. ఆరు దశాబ్దాల క్రితం అప్పటి పెద్దలు కమిటీ సహకారంతో అంజన్న స్వామి విగ్రహానికి ఉన్న చందనాన్ని తీశారు. అప్పటినుండి నేటి వరకు అంజన్న విగ్రహానికి చందనోత్సవాన్ని భక్తుల సౌకర్యం కోసంఅలాగే ఉంచారు. 60 ఏళ్ల అనంతరం నేటి నుండి నుండి 20 వరకు చందనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చందనోత్సవం తొలగింపు సమయంలో మూలవిరాట్టు దర్శనం నిలిపివేస్తారు. చందనోత్సవం చేయాలన్న విషయాన్నిఆలయ అర్చకులు దేవాదాయ శాఖ అధికారులకు తెలపడంతో అందుకు అంగీకరించారు. ఈ ఐదు రోజులపాటు ప్రతిరోజు యజ్ఞం శాంతి హోమం భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులతో పాటు వేద పండితుల మధ్యన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఆరు రోజులపాటు అంజన్న విగ్రహానికి సేవలు నిలిపివేసి ఉత్సవ విగ్రహాన్ని బయట ఏర్పాటు చేసి భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేయనున్నారు. దీన్ని బాలాలయం అని పిలుస్తారు. అనంతరం కొండగట్టు అంజన్న నిజ స్వరూపాన్నిభక్తులకు చూసేందుకు 40 రోజులపాటు అలాగే ఉంచుతారు. 60 ఏళ్ల అనంతరం అంజన్న విగ్రహ నిజస్వరూపాన్ని చూపించేందుకు ఆలయ అధికారులు అర్చకులు ఏర్పాటు చేస్తున్నారు. కాగా అంజన్న విగ్రహాన్నిజస్వరూపం చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 60 ఏళ్ల తర్వాత అంజన్న నిజస్వరూపాన్ని చూడడం మహాభాగ్యం అంటూ అంజన్న భక్తులు మహిళలు గ్రామాలలో చర్చించుకుంటున్నారు. అందుకు ఆలయ అధికారులు కొండగట్టు ఆంజనేయస్వామి అంజన్న ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.....
ఆర్జిత సేవలు రద్దు..
ఈనెల 15నుండి 20 వరకు ఆరు రోజులపాటు చందనోత్సవం కార్యక్రమంలో భాగంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో అంజన రెడ్డి తెలిపారు చందనం తొలగింపు సమయంలో బాలాలయంలో స్వామి వారిని దర్శించుకోవచ్చు . అలాగే ఈనెల 21 నుండి డిసెంబర్ 29 వరకు భక్తులకు స్వామివారి నిజరూపం దర్శించుకోవచ్చు ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు.
నదీజలాలతో అభిషేకం.
కొండగట్టు అంజనేయ స్వామి తొలగింపు లో భాగంగా స్వామివారి మూలవిరాట్ ప్రముఖ నదులైన కావేరి నది తుంగభద్ర కృష్ణా గంగ నదుల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలలతో అభిషేకం చేయనున్నారు.