బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం
వెల్దుర్తి, రూలర్ మేజర్ న్యూస్: వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థి బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా 11వ వార్డు అనకల వీధి, 12వ వార్డు రాణితోట ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు. స్థానికులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.