BREAKING
బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం భక్తి శ్రద్దల మధ్య నరసింహస్వామి జాతర.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే. పల్లె పోరుకు తెరలేచింది.. మూడు రోజులు నామినేషన్ల పర్వం ఆరు దశాబ్దాల అనంతరం అంజన్న నిజ స్వరూపం.. కోయ నర్సాపురంలో ఘనంగా బాలల గ్రామసభ.. పల్లెల్లో పగడ్బందీగా పోలీసుల నిఘా, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు. డీఎస్పీ దైవప్రసాద్. ఒకే రౌటర్ లోపంతో అమెరికా విమానయానం అతలాకుతలం... 14 పంచాయతీల్లో సర్పంచ్ పీఠంపై ఆశావహుల కన్ను.. ఒకరిని మించి మరొకరు.. పార్టీలకు అభ్యర్థుల ఎంపికే పెద్ద సవాల్! హార్ముజ్ జలసంధి దాడులతో చమురు ధరల సెగ రేపటి స్టాక్ మార్కెట్ అంచనాలు: గల్ఫ్ ఉద్రిక్తతలు, చమురు ధరల ప్రభావంతో అప్రమత్తంగా మదుపర్లు! అతి వేగంతో అదుపుతప్పి బోల్తాపడిన ఇన్నోవా.. ఆరుగురికి తీవ్ర గాయాలు హౌతీ డ్రోన్లను కూల్చివేసిన సౌదీ సంకీర్ణ దళాలు మధురై తనిష్క్ దోపిడీ కేసులో యూట్యూబర్ మీనాక్షి, ప్రధాన నిందితుడి తండ్రి అరెస్ట్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన బెంగాల్ సీఎం సువేందు అధికారి ఢిల్లీ ఈడీ కార్యాలయం నుంచి బయలుదేరిన వైద్యుల బృందం

పల్లె పోరుకు తెరలేచింది.. మూడు రోజులు నామినేషన్ల పర్వం

Select Suryaa Now
పల్లె పోరుకు తెరలేచింది.. మూడు రోజులు నామినేషన్ల పర్వం

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో జిల్లాలో పల్లెపోరు రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు.
కర్నూలు జిల్లాలో మొత్తం 26 మండలాల పరిధిలో 484 గ్రామ పంచాయతీలు, 5,100 వార్డులు ఉండగా, 12.50 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు ఎన్నికల ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
మొదటి విడతలో ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆదోని-1, ఆదోని-2, హోలగుంద మండలాలు, పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎనిమిది మండలాల్లో నవంబర్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
నవంబర్ 15–17: నామినేషన్ల స్వీకరణ (ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు). నవంబర్ 18: నామినేషన్ల పరిశీలన. నవంబర్ 19: తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్ల దాఖలు. నవంబర్ 20: అప్పీళ్ల పరిష్కారం. నవంబర్ 21: మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ. నవంబర్ 26: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్.అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల ప్రకటన.నవంబర్ 27 అవసరమైతే రీపోలింగ్.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*