కోయ నర్సాపురంలో ఘనంగా బాలల గ్రామసభ..
కోయ నర్సాపురంలో బాలల గ్రామసభ..
దుమ్ముగూడెం సూర్య మేజర్ న్యూస్::
మండల పరిధిలోని కోయనరసాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు.సర్పంచ్,పంచాయతీ సెక్రెటరీ,పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ..గ్రామంలో విద్య,ఆరోగ్యం,మౌలిక వసతులు,బాలల హక్కులపై చిన్నారులు పలు విషయాలను పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అర్జున్, పంచాయతీ కార్యదర్శి మైరున్, అంగన్‌వాడీ సిబ్బంది,ఉపాధ్యాయులు, గ్రామస్తులు,పిల్లలు పాల్గొన్నారు.