13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతి విస్తృత ప్రచారం
వెల్దుర్తి, మేజర్ న్యూస్:వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతి, మాజీ ఎంపీపీ ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ ఆదివారం 13వ వార్డులో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి గడపకూ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, తమకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెల్దుర్తి మేజర్ పంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 13వ వార్డులో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలను గెలిచిన వెంటనే ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని పేర్కొంటూ, ఎన్నికల్లో తమకు అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు