BREAKING
కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు విషాదాలను మళ్లీ గుర్తు చేసుకోవడం చాలా కష్టం.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులలో నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ కార్యక్రమం పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి శెట్టిపాలెంలో శ్రీశ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక్ శోభతో కల కల లాడిన శైవ క్షేత్రం ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి గ్రామాల్లో పంచాయతీల పదవుల వేడి అభివృద్ధికి పట్టం కట్టండి.. పట్టణ ప్రగతికి భాగస్వామ్యంగా నిలవండి... ఎమ్మెల్యే " కోండ్రు " బోల్తా పడిన లారీ ఆడపిల్లను కాపాడుకుందాం.. లింగ నిర్ధారణకు స్వస్తి పలుకుదాం! ధర్మపురిలో సందడే సందడి.. భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఐటీఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.... శివాలయాల్లో మార్మోగిన హరనామస్మరణం

కార్మిక శక్తి సర్వేకు ప్రజలు సహకరించాలి

Select Suryaa Now
కార్మిక శక్తి సర్వేకు ప్రజలు సహకరించాలి

 

సూర్య - పెద్దపల్లి : దేశవ్యాప్తంగా జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)–2026కు ప్రజలు సహకరించి సరైన వివరాలు అందించాలని ఉమ్మడి జిల్లా గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ కోరారు. సోమవారం ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి తదితర అంశాలపై విశ్వసనీయ గణాంకాలు సేకరించేందుకు ఈ సర్వే చేపట్టినట్లు తెలిపారు. కుటుంబాల విద్యార్హతలు, ఉద్యోగాలు, కూలి పనులు, వేతనాలు, మహిళల ఆదాయ వనరులతో పాటు జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసే గిగ్ కార్మికుల వివరాలను కూడా నమోదు చేస్తామన్నారు. ఎంపికైన కుటుంబాలను మూడు నెలలపాటు ప్రతి నెలా సందర్శించి మొబైల్ ట్యాబ్ ద్వారా వివరాలు సేకరిస్తామని పేర్కొన్నారు.సర్వేలో సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచి గణాంకాల రూపకల్పనకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఎలిగేడు ఎంపీడీవోలను కలిసి సర్వే ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య, ఉపసర్పంచ్ తానిపర్తి రమేష్‌రావు, పంచాయతీ కార్యదర్శి జూపాక శివకుమార్, గ్రామస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.