కాలేశ్వరంపై కుట్ర పన్నింది సీఎం రేవంత్ రెడ్డి
భూపాలపల్లి సూర్యప్రతినిధి, మేజర్ న్యూస్, తెలంగాణకు అతిపెద్ద నీటి వనరులుగా నిర్మించిన కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పై సీఎం రేవంత్ రెడ్డి కుట్రపన్నే నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టును శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాగునీటి కోసం చేతులు ఎత్తేశారని విమర్శించారు . అంతేకాక
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నాడని, మేడిగడ్డ దగ్గర గేట్లు వేసి నీళ్లు ఆపే అవకాశం ఉన్నప్పటికీ చేయడం లేదని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ పేరును రేవంత్ రెడ్డి నాశనం చేశారని విమర్శించారు. దేవాదుల నుంచి నీళ్లును వదిలిపెట్టని పాపం రేవంత్ రెడ్డిదే నని, మిషన్ భగీరథకు గతంలో అనేక అవార్డులు వచ్చాయన్నారు. మిషన్ భగీరథను పట్టించుకోవడం లేదని, కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడే మాటలేనని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించేందుకు కృషి చేయకుంటే, ఈ ప్రభుత్వానికి ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గోన్నారు.
గట్టు. రవీందర్ గౌడ్, సూర్య స్టాఫ్ రిపోర్టర్, భూపాలపల్లి.