BREAKING
ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి టెన్నిస్ కోర్టులో అదరగొట్టిన భారత స్టార్.. కెరీర్‌లో ఐదో ఏటీపీ డబుల్స్ టైటిల్ సాధించిన యూకీ బాంబ్రీ విశేషాలంకరణలో శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలను వాడాలి రెస్లింగ్ పోటీల్లో పోరాడి ఓడిన భారతీయ రెజ్లర్ లలిత్.. తృటిలో చేజారిన కాంస్య పతకం అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు హాళ్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి మూడో టీ20కి ముందు టీమిండియాను హెచ్చరించిన మోర్నే మోర్కెల్.. వెల్లింగ్టన్ గాలులపై ప్రత్యేక దృష్టి టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు. మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం జన్నారంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ డ్రాయింగ్ పోటీల్లో శ్రీ శారద విద్యానికేతన్ విద్యార్థిని ప్రతిభ

జీఓ 49ను రద్దు చేయాలి...ఆదివాసీల హక్కులను కాపాడాలి.. తుడుం దెబ్బ డిమాండ్

Select Suryaa Now
జీఓ 49ను రద్దు చేయాలి...ఆదివాసీల హక్కులను కాపాడాలి.. తుడుం దెబ్బ డిమాండ్
సూర్య, పెంచికల్ పేట్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాల ప్రజల భూమి హక్కులు, జీవనోపాధి, సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించే జీఓ నం.49ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ మాట్లాడుతూ.. తరతరాలుగా అడవులనే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలు పోడు వ్యవసాయం ద్వారా కుటుంబాలను పోషించుకుంటూ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని తెలిపారు.టైగర్‌ జోన్లు, కన్జర్వేషన్‌ కారిడార్లు, బఫర్‌, కోర్‌ ఏరియాల పేరుతో ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకోవడం సరికాదన్నారు. తెలంగాణవ్యాప్తంగా పోడు సాగు చేస్తున్న ఎనిమిది లక్షల మంది అర్హులైన ఆదివాసీ రైతులకు అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం సర్వే నిర్వహించి హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరారు.కమ్మర్గాం, మొర్లిగూడెం, జిల్లాడ, నందిగామ, గుండెపల్లి, జైహింద్‌పూర్‌, సోమిని, మొగవెల్లి, కొయ్యపెల్లి, రావణ్‌పెల్లి, దిగ్గిడ గూడెం తదితర ఆదివాసీ గ్రామాలకు తక్షణమే రహదారులు మంజూరు చేయాలని, అటవీ అధికారుల వేధింపులు, దౌర్జన్యాల నుంచి ఆదివాసీలను రక్షించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోయం చిన్నయ్య, రాష్ట్ర కార్యదర్శులు గంట సత్యం, అర్కా శేషారావు, జిల్లా ఉపాధ్యక్షుడు తలండి మధుకర్‌, మురళి గూడ సర్పంచ్ పోర్తేటి వెంకటేష్ మరియు మాడవి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.