BREAKING
ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కె. రాజా రెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దంపతులు కుటుంబానికి పరామర్శ. ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ 16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ ఎన్ ఎల్ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కానాల కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం చైర్మన్ ప్రమీల,కౌన్సిలర్ అంతిరెడ్డి భూముల రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా ఎస్సీ సెల్ నేత నన్నం జస్టిస్. 53వ డివిజన్ ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న శంకర్ యాదవ్ విక్రమ సింహపురి యూనివర్సిటీ అంతర కళాశాలలో ఆటలపోటీలు నిర్వహించారు. లే అవుట్ లను పరిశీలించిన కమిషనర్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇస్నాపూర్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ దంపతులు

జైత్వారం అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
జైత్వారం అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం

జైత్వారం అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం

** పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

** సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి

కందుకూరు, అక్టోబర్ 24: 
కందుకూరు మండలం జైత్వారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో వీఎచ్‌ఎం ( విహెచ్ఎం ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ రెడ్డి, సూపర్‌వైజర్ శ్యామల, సిస్టర్ రజని, అంగన్‌వాడీ టీచర్ సుమతి, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, తల్లులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 0–5 సంవత్సరాల పిల్లలు, గర్భిణులు, బాలింతలకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు, వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. ప్రతి నెల మొదటి శనివారం పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు, నాలుగో శనివారం గర్భిణులకు అవసరమైన టీటీ ఇంజెక్షన్లు, పిల్లలకు టీకాలు అందించే కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి మాట్లాడుతూ...తల్లులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిర్ణీత సమయంలో టీకాలు వేయించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు ఆరోగ్య నియమాలు పాటిస్తూ, పిల్లల సంరక్షణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు.