ఎరువుల దుకాణాలు తనిఖీ
సూర్య,భీమిని మoచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) రాజా నరేంద్ర, మండల వ్యవసాయ అధికారి రజిత శనివారం
సంయుక్తంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దుకాణాల్లోని ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎరువుల నిల్వలకు, రికార్డుల్లో నమోదైన వివరాలకు మధ్య వ్యత్యాసాలు లేకుండా చూసుకోవాలని దుకాణదారులకు సూచించారు.
రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా, నిబంధనలను ఉల్లంఘించినా సంబంధిత దుకాణదారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడటంతో పాటు, పారదర్శకంగా విక్రయాలు జరపాలని సూచించారు. వ్యవసాయ శాఖ నిబంధనలను ప్రతి ఎరువుల వ్యాపారి తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు