బాలల రక్షణ పై అవగాహన కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ లక్ష్యం - జిల్లా మెజిస్ట్రేట్.
సూర్య నిర్మల్ ప్రతినిధి. :
బాలల హక్కులు చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, బాలల రక్షణకు అందరూ కలిసి పనిచేయాలని జిల్లా మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె భవిష్య అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈద్గా నిర్మల్ యందు ఏర్పాటుచేసిన సురక్షిత్ బచ్పన్ అభియాన్ అవగాహన కార్యక్రమం పై ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడినారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కులు, పోక్సో చట్టం బాల్యవివాహాలు బాల కార్మిక వ్యవస్థ సైబర్ క్రైమ్ ట్రాఫిక్ నియమాల పై విద్యార్థులకు అవగాహన కల్పించినారు. గుడ్ టచ్,బ్యాడ్ టచ్, మొబైల్ ఫోన్, వాడకం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు.
ఏదైనా సమస్య ఉంటే వెంటనే చైల్డ్ హెల్ప లైన్ 1098 నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించినారు.
సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టా,లను అతిగా వాడరాదని, వీటివల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని, ఫ్రీ టైం ను చదువు కొరకు సద్వినియోగం చేసుకోవాలని, చెడు వ్యసనాలకు బానిస కావద్దని, విద్యార్థులకు సూచించినారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జువెనైల్ జస్టిస్ బోర్డు మెంబర్,నరేష్ కుమార్,జిల్లా న్యాయ సేవా అథారిటీ లీగల్ హెడ్ సిరాజ్, న్యాయవాది సాయికుమార్, సి.ఐ సమ్మయ్య, ప్రధానోపాధ్యాయులు డి మోహన్ రావు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.