BREAKING
టైర్ల పరిశ్రమల దుర్వాసనతో ప్రజల విలవిల.. తెలంగాణ సచివాలయం వేదికగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం *బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ అతర్ అఫ్సర్‌కు జన్మదిన శుభాకాంక్షలు* పశ్చిమ బెంగాల్‌లో పరారీలో ఉన్న హెరాయిన్ కేసు నిందితుడి అరెస్ట్ అయ్యప్ప స్వాముల అన్న సమారాధన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి -బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి *వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడుకుందాం: ఎంపీడీవో ఉమాదేవి* రత్న సాగర్ ‘బిలీవ్’ లీడర్‌షిప్ ఇంగ్లీష్ కోర్సు ప్రారంభం – ముఖ్య అతిథిగా పుల్లెల గోపీచంద్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం సైకిల్ గుర్తుపై ఓటేసి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని గెలిపించండి జిన్నారంలో అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం యోగాక్రీడలకు ఎంపిక పూర్తి లక్ష్మీపతిగూడెంలో సత్యసాయి పల్లకి సేవ కార్యక్రమం పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాత్లావత్ చందర్ తెలంగాణ రక్షణ సేనలో సంగారెడ్డి నియోజకవర్గానికి నూతన నియామకాలు

టీ ఆర్ పి ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ-మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ

Select Suryaa Now
టీ ఆర్ పి ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ-మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ

సూర్య మంచిర్యాల టౌన్ : తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ తెలిపారు.శనివారం నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం,ప్రజా సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేయడంతో పాటు మండల,గ్రామ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.ప్రజలకు పార్టీ నాయకులు,కార్యకర్తలు అందుబాటులో ఉండేలా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతీ శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రారంభించిన రాజ్యాధికార యాత్రలో భాగంగా నవంబర్ 11న నిర్వహించే పాదయాత్రలో మంచిర్యాల జిల్లా నుంచి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.బహుజనులకు రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించడం,సామాజిక న్యాయం,సమానత్వం సాధించడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.యువత,విద్యార్థులు, మహిళలు, కార్మికులు, రైతులను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామని చెప్పారు.నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బూర రవీందర్,దెబ్బటి శంకర్, తగరం రాజ్ కుమార్, భీమిని రమేష్,బోనగిరి సమ్మయ్య,దుర్గం సంతోష్, వాసాల అనిల్, సత్త్రవేణి వెంకటేష్,మహమ్మద్ లతీఫ్,పడాల శివతేజ తదితరులు పాల్గొన్నారు.