నేషనల్ హైవే అంశంపై రాజకీయ విమర్శలు మానుకోవాలి: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు
సూర్య మంచిర్యాల టౌన్ : నేషనల్ హైవే అంశంలో రైతులను అడ్డుపెట్టుకొని రఘునాథ్ రావుపై కొందరు కావాలనే విమర్శలు చేయిస్తూ బురదజల్లడం మానుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు అన్నారు.శనివారం మంచిర్యాలలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.హాజీపూర్,లక్సెట్టిపేట మండలాలతో పాటు ఇతర ప్రాంతాల రైతుల సమస్యల పరిష్కారం కోసం రఘునాథ్ రావు కేంద్ర మంత్రులు,నేషనల్ హైవే ప్రాంతీయ అధికారులను కలిసి సమస్యలను వివరించారని తెలిపారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు,లేఖలు,తేదీలతో కూడిన ఆధారాలను సోషల్ మీడియాలో పొందుపరిచామని,వాటి స్క్రీన్‌షాట్లను మీడియా ముందు ఉంచామని పేర్కొన్నారు.కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను పావులుగా ఉపయోగించుకుంటూ రఘునాథ్ రావును అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.అలాగే మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం పెనాయిల్, ఎల్‌ఈడీ లైట్ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.మధ్యప్రదేశ్‌లో గత 21 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుమారు రూ.25 లక్షల కోట్ల బడ్జెట్‌లో పెనాయిల్‌కు రూ.33 వేల, ఎల్‌ఈడీ బల్బులకు రూ.11,800 అవినీతి జరిగిందంటూ ఆరోపించడం హాస్యాస్పదమని అన్నారు.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని,కాగ్ నివేదికల్లోనూ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు.అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని, బీజేపీపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు రాకేష్ రెన్వా,జోనల్ అధ్యక్షుడు అమెరిశెట్టి రాజు, మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బొట్ల సత్యంతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు