పోలింగ్ లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలి : జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్..*
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. శనివారం గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు మరియు పోలింగ్ బూత్‌లను జాయింట్ కలెక్టర్ సమగ్రంగా తనిఖీ చేసి పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు మరియు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిబ్బందికి కావాల్సిన మౌలిక వసతులు, భోజన సదుపాయాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి కేటాయించిన స్థలంలోనే రాత్రి బస ఉండేలా చూసుకోవాలని మరియు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల మెటీరియల్‌ను కట్టుదిట్టంగా తనిఖీ చేసుకుని సంబంధిత సిబ్బంది సురక్షితంగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మైక్ సెట్లతో సహా ఇతర సాంకేతిక ఏర్పాట్లను సరిగ్గా అందుబాటులో ఉంచాలని సూచించారు. రేపు ఆదివారం ఉదయం 7:00 గంటలకే పోలింగ్ ప్రారంభం కానున్నందున, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మరియు శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు/సిబ్బందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని కూడా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్ పుణ్యవతి, ఎలక్షన్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.