BREAKING
గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు జైలు శిక్ష పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలి -- కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అనాథాశ్రమంలో చిన్నారి మొదటి పుట్టినరోజు.. అన్నదానంతో వేడుకలు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కత్తిరి నాగమణి ఇంటింటా ప్రచారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల జట్టుకు నెల్లూరు జోన్ క్రికెట్ టైటిల్ బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలి... అభివృద్ధి బాటలో కూటమి.. గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం... మామిడి సుమతిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: బీజేపీ నాయకుల పిలుపు. ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి వైసిపి ఎంపిటిసి అభ్యర్థి ముత్యాలయ్య రుద్రకోటలో వైకాపా నుండి టిడిపిలో చేరిన 20 కుటుంబాలు. కరటంపాడులో వైసీపీ నేతల ప్రచారం దళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ సుంకె ప్రసాద్ ఉపాధ్యాయ డిమాండ్ల సాధనకు పి ఆర్ టి యు పోరాటం విద్యార్థినిపై దాడి చేయడం అత్యంతఅమానుషం

మళ్లీ ఆదరిస్తే శంబర మరింత అభివృద్ధి

Select Suryaa Now
మళ్లీ ఆదరిస్తే శంబర మరింత అభివృద్ధి

మక్కువ, సూర్య : రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి టిడిపి శంబర ఎంపీటీసీ అభ్యర్థిగా బలపరిచిన తీళ్ల జయమ్మ ను ఆదరించి గెలిపిస్తే శంబర గ్రామాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని అభ్యర్థి తీళ్ల జయమ్మ తరఫున ఆమె భర్త తాజా మాజీ ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు కోరుతున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని గెలిపించి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ఆయన కోరుతున్నారు. ప్రధానంగా గ్రామానికి శివారులో ఉన్న కొత్త కాలనీ నివాస ప్రజలను దుర్భర పరిస్థితుల నుండి విముక్తి కలిగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాలనీలో ప్రతి వీధికి సీసీ డ్రైనేజీలతో పాటు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు మంత్రివర్యులు తమకు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అక్కడ ప్రజలు తాగునీరు, విద్యుత్ సౌకర్యంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్నట్టు వివరించారు. కాలనీ వాసులకు నిరంతరం తాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని అభ్యర్థి భర్త తీళ్ల పోలినాయుడు తెలిపారు. శంబర గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి తీళ్ల జయమ్మ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. శనివారం ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి తమను గెలిపించాలని కోరుతూ అభ్యర్థి జయమ్మ విన్నవించారు.