పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నది కూటమి ప్రభుత్వమే.
కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలి.
దర్శి జెడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ తాయారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
సూర్య న్యూస్ దర్శి.
నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు. మండలంలోని లంకోజనపల్లి వెంకటాపురం గ్రామాలలో కూటమి జెడ్పిటిసి అభ్యర్థి వరికూటి లక్ష్మీ తయారు ను గెలిపించాలని ఎన్నికల ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికికూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుతుందన్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలన్నీ అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అభివృద్ధి మరింత వేగంగా జరగాలంటే కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ లక్ష్మి కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.