BREAKING
విద్యుత్ షాక్ తో మహిళ మృతి నార్త్ మోపూరు గ్రామ ప్రతినిధుల బృందం బీద రవిచంద్రకు వినతిపత్రం గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు జైలు శిక్ష పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలి -- కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అనాథాశ్రమంలో చిన్నారి మొదటి పుట్టినరోజు.. అన్నదానంతో వేడుకలు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కత్తిరి నాగమణి ఇంటింటా ప్రచారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల జట్టుకు నెల్లూరు జోన్ క్రికెట్ టైటిల్ బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలి... అభివృద్ధి బాటలో కూటమి.. గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం... మామిడి సుమతిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: బీజేపీ నాయకుల పిలుపు. ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి వైసిపి ఎంపిటిసి అభ్యర్థి ముత్యాలయ్య రుద్రకోటలో వైకాపా నుండి టిడిపిలో చేరిన 20 కుటుంబాలు. కరటంపాడులో వైసీపీ నేతల ప్రచారం దళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ సుంకె ప్రసాద్

ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ బొబ్బిలి మాజీఎమ్మెల్యే. .చంబంగివెంకట చిన్నప్ప నాయుడు

Select Suryaa Now
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ బొబ్బిలి మాజీఎమ్మెల్యే. .చంబంగివెంకట చిన్నప్ప నాయుడు

రామభద్రపురం, సూర్య : నవంబర్ 5న జరగనున్న ఎంపీటీసీ జడ్పిటిసిఎన్నికల వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించాలని బొబ్బిలి మాజీ శాసనసభ్యులు, బొబ్బిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు  కోరారుశనివారం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పులు తదితర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలను ఈ సందర్భంగా వివరించారు. అలాగే, రాబోయే రోజుల్లో గ్రామ ప్రజల సహకారంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ని ముఖ్యమంత్రిగా, తనను స్థానిక ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే,  గ్రామంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ జడ్పిటిసిఅభ్యర్థులు  ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ అధ్యక్షులు చొక్కాపు లక్ష్మణరావు వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థులు బొంగda నాయుడు ఏ శివ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ డబ్ల్యూ రాయులు మండల వైసిపిమాజీ ఉపాధ్యక్షులు డార్రు పైడ్రాజు జిల్లావ్యవసాయ జిల్లా వ్యవసాయ అనుబంధ సంస్థ డైరెక్టర్ నడిమింటి సత్యం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.