నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి
విజయనగరం బ్యూరో, సూర్య : తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తన తండ్రి కోలగట్ల వీరబద్ర స్వామి విజయనగరం ప్రజలకు చేసిన సేవలు, నగర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి ప్రజలు తనను తమ ఇంటి ఆడపడుచుగా ఆదరించాలని వైసీపీ మేయర్ అభ్యర్థిని కోలగట్ల శ్రావణి అభ్యర్థించారు. ఈ 10 రోజుల ప్రచారంలో 62 వార్డుల్లో ప్రతి ఇంటి ముందు చేసిన అబివృద్ధిని ప్రజలకు చూపించామన్నారు. కూటమి వచ్చి రెండున్నర ఏళ్ళలో ఏం చేసిందని ప్రజలను ప్రశ్నించగా, ఎమ్మెల్యేను తాము ఎన్నడూ చూడలేదని చెబుతున్నారని విమర్శించారు. తన తనకు మంచి సంస్కారం నేర్పారని తెలిపారు. 540 కోట్లతో అభివృద్ధి చేశామని కూటమి నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, అభివృద్ధి ఎక్కడ చేసారో, ఆ కోట్ల నిధులు ఏ మూలకు వెళ్లాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ హయంలో కనుల విందుగా అబివృద్ధి చేశామని అవన్నీ లెక్కలతో, పేర్లతో చెప్పగలనని అన్నారు. కూటమి పాలన వస్తే నగర వాసులు ఊపిరి పీల్చుకోవడానికి కూడా టాక్స్ కట్టాలని ఆరోపించారు. ప్రజలకు మంచి చేసే ఆలోచన, చేసిన అబివృద్ధి చెప్పగలిగే సత్తా తమకుందని అన్నారు. ప్రజా మద్దతుతో ఐదేళ్లు డిప్యూటీ మేయర్ గా పనిచేసిన అనుభవంతో ప్రజలను అభ్యర్థిస్తున్నానని, నాన్న స్వామిని ఆశీర్వదించినట్టే తనను కూడా ఆశీర్వదించాలని కోరారు. జగనన్న పాలన మళ్లీ రావాలని విజ్జప్తి చేశారు. ఈ సందర్బంగా విజన్ విజయనగరం పేరిట మేనిఫెస్టో ను వివరించారు.
వైసీపీ విజన్ విజయనగరం మేనిఫెస్టో..
ప్రజల వద్దకే మేయర్..
మీ వద్దకే మీ మేయర్ ప్రతి వార్డు లో ప్రజలతో ప్రత్యేక సమావేశాలు సమస్యల పరిష్కారం కు ప్రత్యేక చొరవ..
24/7 డిజిటల్ గ్రీవెన్స్ సెల్..
ఒక్క మేసేజ్ తో సమస్యకు పరిష్కార మార్గం..వాట్స్ అప్ లో ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు డిజిటల్ ట్రాకింగ్.
మహిళా భద్రత సాధికారత..
మహిళ భద్రతే నా ప్రథమ ప్రాధాన్యత సీసీ కెమెరాలు ఎల్ ఈ డి లైట్లు శానిటరీ ఫ్యాడ్స్ వెండింగ్ మిషన్లు ఫీడింగ్ రూంలు.
పర్యాటక అభివృద్ధి ఉపాధి..
విజయనగరం వైభవానికి కొత్త వెలుగులు చారిత్రక సంస్కృతి క పర్యాటక అభివృద్ధి తో స్థానికులకు ఉపాధి అవకాశాలు.
సీనియర్ సిటిజన్ల సంక్షేమం..
పెద్దలకు గౌరవం ఆరోగ్యానికి ప్రాధాన్యత, వాకింగ్ ట్రాక్ లు విశ్రాంతి బెంచీలు ఆహ్లాదకర పార్కుల అభివృద్ధి.
తాగునీరు పారిశుద్ధ్యం ప్రజారోగ్యం..
ప్రతి ఇంటికి నీరు ప్రతి విధిలో పరిశుభ్రత సురక్షిత త్రాగు నీరు మెరుగైన పారిశుద్ధ్యం ఆరోగ్య కరమైన విజయనగరం.
క్రీడాకారులకు భరోసా..
క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సాహం, క్రీడా రంగానికి కొత్త ఉత్సాహం క్రీడా మైదానాల అభివృద్ధి ఆధునిక పరికరాలు, మెరుగైన క్రీడా వసతుల కల్పన.