BREAKING
టైర్ల పరిశ్రమల దుర్వాసనతో ప్రజల విలవిల.. తెలంగాణ సచివాలయం వేదికగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం *బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ అతర్ అఫ్సర్‌కు జన్మదిన శుభాకాంక్షలు* పశ్చిమ బెంగాల్‌లో పరారీలో ఉన్న హెరాయిన్ కేసు నిందితుడి అరెస్ట్ అయ్యప్ప స్వాముల అన్న సమారాధన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి -బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి *వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడుకుందాం: ఎంపీడీవో ఉమాదేవి* రత్న సాగర్ ‘బిలీవ్’ లీడర్‌షిప్ ఇంగ్లీష్ కోర్సు ప్రారంభం – ముఖ్య అతిథిగా పుల్లెల గోపీచంద్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం సైకిల్ గుర్తుపై ఓటేసి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని గెలిపించండి జిన్నారంలో అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం యోగాక్రీడలకు ఎంపిక పూర్తి లక్ష్మీపతిగూడెంలో సత్యసాయి పల్లకి సేవ కార్యక్రమం పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాత్లావత్ చందర్ తెలంగాణ రక్షణ సేనలో సంగారెడ్డి నియోజకవర్గానికి నూతన నియామకాలు

గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ *

Select Suryaa Now
గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్  *

విజయనగరం, సూర్య : విజయనగరం జిల్లా తెర్లాం మండలం రంగప్పవలస గ్రామానికి చెందిన సిగిలి వెంకటేష్ (29సం.లు) అనే నిందితుడు తరచూ గంజాయి అక్రమ రవాణాకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అతడిపై పీడీ యాక్ట్ అమలు చేసి, అక్టోబర్ 31న విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్  తెలిపారు.
జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్  మాట్లాడుతూ సిగిలి వెంకటేష్ పై ఇప్పటికే తెర్లాం పోలీస్ స్టేషన్‌లో ఒకటి, బుదరాయవలస పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి —మొత్తం రెండు గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు. ఆయా కేసుల్లో నిందితుడి వద్ద నుండి మొత్తం 16.570 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు తన నేర ప్రవృత్తిని మార్చుకోకుండా పదేపదే గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నందున, నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అతడిపై పీడీ యాక్ట్ కింద నిర్బంధ చర్యలను బొబ్బిలి రూరల్ సిఐ మల్లికార్జునరావు చేపట్టినట్లు తెలిపారు.  జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పదేపదే నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ప్రజల భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసు శాఖ నిరంతరం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ, ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా సిగిలి వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని, 1 సం. వరకు బెయిల్ రాకుండా చర్యలు చేపట్టి, అతడిని విశాఖ సెంట్రల్ జైలుకి తరలించామని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్  తెలిపారు.