BREAKING
ఏదో ఒక రోజు ‌మల్కాపూర్ స్వచ్ఛభారత్ ప్రధాని దృష్టికి వెళుతుంది ఆసియా క్రీడల్లో సేవలకు అంతర్జాతీయ టెక్నికల్‌ గోల్డ్‌ మెడల్‌ టైర్ల పరిశ్రమల దుర్వాసనతో ప్రజల విలవిల.. తెలంగాణ సచివాలయం వేదికగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం *బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ అతర్ అఫ్సర్‌కు జన్మదిన శుభాకాంక్షలు* పశ్చిమ బెంగాల్‌లో పరారీలో ఉన్న హెరాయిన్ కేసు నిందితుడి అరెస్ట్ అయ్యప్ప స్వాముల అన్న సమారాధన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి -బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి *వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడుకుందాం: ఎంపీడీవో ఉమాదేవి* రత్న సాగర్ ‘బిలీవ్’ లీడర్‌షిప్ ఇంగ్లీష్ కోర్సు ప్రారంభం – ముఖ్య అతిథిగా పుల్లెల గోపీచంద్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం సైకిల్ గుర్తుపై ఓటేసి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని గెలిపించండి జిన్నారంలో అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం యోగాక్రీడలకు ఎంపిక పూర్తి లక్ష్మీపతిగూడెంలో సత్యసాయి పల్లకి సేవ కార్యక్రమం

భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామనడం సీఎం చేతకానితనం -- ఢిల్లీకి మూటలు పంపడం ఆపితే రాష్ట్ర అభివృద్ధికి నిధులు సరిపోతాయి -- సీఎం రేవంత్ రెడ్డి పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శలు

Select Suryaa Now
భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామనడం సీఎం చేతకానితనం          -- ఢిల్లీకి మూటలు పంపడం ఆపితే రాష్ట్ర అభివృద్ధికి నిధులు సరిపోతాయి                -- సీఎం రేవంత్ రెడ్డి పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శలు

నారాయణపేట (కొడంగల్), సూర్యన్యూస్: 

ప్రభుత్వ భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఢిల్లీకి మూటలు పంపడం ఆపితే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సరిపోతాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. శనివారం కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. దేశంలో డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించకూడదా అని ప్రశ్నించారు. నిజంగా ఓటు చోరీ జరిగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదని వ్యాఖ్యానించారు. దేశ విచ్ఛిన్నకర శక్తులు యువతను రెచ్చగొడుతున్నాయని, దేశంలో అరాచక పరిస్థితులు సృష్టించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని డీకే అరుణ కోరారు.

*కేంద్ర ప్రభుత్వ నిధులతో కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి*
గత రెండేళ్లలో అమృత్ పథకం కింద రూ.2.22 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఎంపీ నిధుల నుంచి రూ.1.45 కోట్లతో రోడ్లు, కమ్యూనిటీ హాల్, హైమాస్ట్ లైట్ల అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. పీఎం శ్రీ పథకం కింద రూ.79.50 లక్షలతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకం కింద రూ.69.75 లక్షలు, వీబీ జీ రామ్ జీ పథకం కింద రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. స్థానికుడు కాకపోయినా రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. అయితే కొడంగల్‌లో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందించకపోవడం అన్యాయమని, బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

*సొంత జిల్లాలోని ప్రాజెక్టులపై దృష్టి సారించాలి*
మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె కోరారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి అప్రోచ్‌ను నార్లాపూర్‌కు మార్చడం ద్వారా కేసీఆర్ పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. మొదటి డీపీఆర్ ప్రకారం జూరాల నీటి అప్రోచ్‌తోనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జూరాల అప్రోచ్‌ను పునరుద్ధరించి ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు అందించేలా ప్రణాళిక రూపొందించాలని కోరారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే పాలమూరు జిల్లాకు అన్యాయం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కడాకు కొండారెడ్డిపల్లి నుంచి నిధులు రావడం లేదని, దానికంటూ ప్రత్యేక నిధులు కూడా లేవని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను మళ్లించి కడాకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల అప్రోచ్‌తో పనులు చేపట్టాలని, నిధుల కోసం కేంద్రం వద్దకు కలిసి వెళ్దామని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

*నవంబర్ 2న మహా పాదయాత్ర*
నవంబర్ 2న హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు డీకే అరుణ తెలిపారు. నిజాం కాలేజీ ప్రాంగణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మోజంజాహి మార్కెట్ వరకు జరిగే ఈ పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో నిర్వహించే ఈ పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, నారాయణపేట జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, పూనం చంద్ లహటి, ప్రతాప్ రెడ్డి, బస్వరాజు, మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి  పాల్గొన్నారు.

– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.