తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు "
రాజాం, సూర్య : తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన సీనియర్ నేత, పీఏసీఎస్ అధ్యక్షులు వంగా గోవిందరావు (75) అనారోగ్యంతో మృతి చెందడం పట్ల మాజీ మంత్రి,తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ విచారం వ్యక్తం చేశారు.రాజాం మండలం ఒమ్మి గ్రామంలో ఆయన నివాసానికి వెళ్లి, అతని భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించి పూలమాలలు వేశారు.ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం నింపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ వంగా గోవిందరావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటన్నారు.పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి,పటిష్టతకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేశారన్నారు.పార్టీ కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా నిలుస్తూ సేవలందించారని గుర్తుచేశారు.పార్టీ కోసం ఆయన చేసిన కృషి, అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.